హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.. వీవీ లక్ష్మీనారాయణ

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.. వీవీ లక్ష్మీనారాయణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా తీర్మానించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. 2014 జూన్ 2 నుండి 2024 జూన్ 1వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా జారీ చేయబడ్డ గెజిట్ నోటిఫికేషన్ తెలిపింది ప్రభుత్వం. 2024 జూన్ 1కి సమయం దగ్గరపడింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే గడువు కూడా ముగియనుంది.

2024 జూన్ 2వ తేదీ తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హోదా కోల్పోయి కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే ఏపీకి సంబందించిన కార్యాలయాలు షిఫ్ట్ అవ్వటం కూడా మొదలైంది. రెడ్ హిల్స్ లో ఉన్న సింగరేణి కాలనీలో సింగరేణి భవన్ లో ఉన్న ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా కర్నూలుకు షిఫ్ట్ అయ్యింది. 

ఈ క్రమంలో జై భారత్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త వాదన తెరమీదకు తెచ్చారు.హైదరాబాద్ ను మరో పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వాదన తెరపైకి తెచ్చారు లక్ష్మీనారాయణ. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.2014 జూన్ 2తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని, మరో పదేళ్ళపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ఆర్డినెన్స్ తేవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.