హైదరాబాద్ ఈ ఏరియాల్లో భారీ వర్షం.. బయటకు వెళ్ళకండి..

హైదరాబాద్ ఈ ఏరియాల్లో భారీ వర్షం.. బయటకు వెళ్ళకండి..

హైదరాబాద్ లో మళ్ళీ వర్షం మొదలైంది.. బుధవారం ( మే 21 ) పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సిటీలోని కోటి, ఎమ్ జే మార్కెట్ , చాదర్ ఘాట్, దిల్ సుఖ్ నగర్,కొత్త పేట, మలక్ పేట, చంపాపేట, సికింద్రాబాద్, బషీర్ బాగ్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు చోట్ల మోస్తరు వర్షం కురుస్తుండగా.. అక్కడక్కడా భారీ వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. వర్షం కురిసే సమయంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే  అవకాశం ఉన్న క్రమంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించింది వాతవరణ శాఖ.

ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా  గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యి... మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు మరింత  పురోగమిస్తూ.. దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు,  అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. 
  
రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ పలు జిల్లాల్లో అక్కడక్కడా కురిసే వకాశం ఉందని.. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.