ఇవాళ (గురువారం) ఉదయం నుండి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నిన్న(బుధవారం) కుండపోతగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యయి. రోడ్లపై వరద నీరు పొంగి పొర్లడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో బైక్ లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నగరలోని 52 ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, మూడు భవనాలు కూలిపోయాయి.ఇంకా అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్టై సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డ చెట్ల కొమ్మలను తొలగించారు GHMC సిబ్బంది.
జూబ్లీ హిల్స్‌లో అత్యధికంగా 110.33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ( గురువారం) నగరం అంతటా చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
