ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం.. రుతుపవనాల కారణంగా రాష్టంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశమున్నట్లు చెప్పింది. రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాలకు భారీ వర్ష సూచనలున్నట్లు తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకావమున్నట్లు చెప్పింది. హైదరాబాద్‌లోనూ సాయంత్రం అయ్యేసరికి వర్షం పడే అవకాశాలున్నాయని తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్టంలో ఉత్తర, మధ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రానున్న మూడు గంటల్లో రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైద్రాబాద్, రాజన్న సిరిసిల్ల, జనగామ, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. వర్షాలు పడే సమయంలో గంటకు 30 కిలో మీటర్లు లేదా అంతకన్నా వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.