ఓరి దేవుడా.. హైదరాబాద్‎లో ఈ కుండపోత వర్షం ఏంటి సామీ: రోడ్లపై వరదలా వెల్లువెత్తిన నీళ్లు

ఓరి దేవుడా.. హైదరాబాద్‎లో ఈ కుండపోత వర్షం ఏంటి సామీ: రోడ్లపై వరదలా వెల్లువెత్తిన నీళ్లు

హైదరాబాద్ సిటీ జనం వణికిపోయారు.. పడుతున్న వర్షం చూసి ఓరి దేవుడా ఇదేం వర్షం.. ఈ కుండపోత వర్షం ఏంటీ సామీ అంటూ షాక్ అయ్యారు. 2025, సెప్టెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం నుంచి ఎర్రటి ఎండ.. మధ్యాహ్నం 4 గంటల వరకు సిటీ అంతా పొడిగా ఉంది. ఆకాశం అంతా క్లియర్ గా ఉంది.. 4 గంటల తర్వాతే అసలు సిసలు సినిమా స్టార్ట్ అయ్యింది హైదరాబాద్ సిటీ వాసులకు. 

ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. కారు మబ్బులు కమ్మేశాయి. చినుకు చినుకు అన్నట్లు మొదలైన చిన్న వర్షం.. కళ్లు మూసి తెరిచేలోపు.. నిమిషాల్లోనే కుండపోత వానగా మారిపోయింది. క్లౌడ్ బరస్ట్ గా ఒకటే జోరు వాన. ఎడతెరిపి లేకుండా దంచి కొట్టిన వర్షంతో హైదరాబాద్ సిటీ జనం వణికిపోయారు. 

మరీ ముఖ్యంగా ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్ పల్లి, మెహదీపట్నం, నాంపల్లి, ఆసిఫ్ నగర్, గచ్చిబౌలి, మూసాపేట, నిజాంపేట, మియాపూర్ ఏరియాల్లో అయితే రోడ్లపై నీళ్లు వరదలా వచ్చేశాయి.

ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు.. 40 నిమిషాలు.. అక్షరాల 40 నిమిషాలు పడిన వర్షం ఏదైతే ఉందో.. సిటీ జనాన్ని వణికించేసింది. రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇవి రోజూ తిరిగే రోడ్లేనా లేక నదులా అన్నట్లు మారిపోయాయి ఆయా ఏరియాల్లోని రహదారులు. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ట్రాఫిక్ జాం అయ్యింది. కార్లలో వెళ్లేవాళ్లు.. ఫుల్ వైపర్ వేసినా రోడ్డు కనిపించనంతగా వర్షం భయపెట్టింది. అంతేనా బైక్ పై వెళ్లే వాళ్లు రోడ్డు పక్కన ఎక్కడికక్కడ ఆగిపోయారు.

ముఖ్యంగా నగరంలోని ఎంజే మార్కెట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రమంజిల్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, తార్నాక, అబిడ్స్, లక్డీకపూల్, బోరబండ, ఎస్ఆర్ నగర్, మోతినగర్, బోయినపల్లి, మల్కాజిగిరి, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, కూకట్ పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, నాంపల్లి, వనస్థలిపురం, నాగోల్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.