రాజస్థాన్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలు జలమయమయ్యాయి. బిల్వారాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. మోకాళ్లలోతు నీళ్లల్లోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారీ వర్షాలతో జోధ్పూర్ను వరద ముంచెత్తింది. దీంతో నగరంలోని కూరగాయల మార్కెట్ జలమయం అయ్యింది. వీధుల్లో తీవ్రంగా వరద నీరు చేరింది. వరద ప్రవాహంలో కార్లు,బైకులు కొట్టుకుపోయాయి. ప్రజలు ఇంటి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది.
