కృష్ణమ్మ పరవళ్లు : శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తివేత

కృష్ణమ్మ పరవళ్లు : శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తివేత

కృష్ణా నది ఉగ్రరూపం కొనసాగిస్తోంది. ఎగువ నుండి వరద ప్రవాహం భారీగా వస్తుండడంతో.. శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్ లో శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇది నాలుగోసారి. అయితే.. పూర్తి స్థాయిలో పది గేట్లు ఎత్తడం రెండోసారి. ఎగువన కురుస్తున్న వర్షాలతో  కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో వస్తున్న వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం డ్యాం ప్రస్తుత ఇన్ ఫ్లో: 1 లక్షా 84 వేల 279 క్యూసెక్కులు ఉంది.10 గేట్ల ద్వారా 2 లక్షల 78 వేల క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 68 వేల 908 క్యూసెక్కులు చొప్పున మొత్తం 3 లక్షల 72 వేల క్యూసెక్కుల వరదను దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు.. 215.807 టీఎంసీల సామర్థ్యం ఉండగా..  884.60 అడుగులతో.. 213.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటికే నిండుకుండలా ఉండడంతో.. వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.