హలో సంగారెడ్డి.. పక్కా లోకల్ రేడియో

హలో సంగారెడ్డి.. పక్కా లోకల్ రేడియో

‘‘హలో.. సంగారెడ్డి.. మీ మంచిచెడ్డలు, మీ ఊళ్ల ముచ్చట్లు తెలుసుకొనికే వచ్చిన. ఊళ్ళ అందరు మంచిగున్నరా? ఎవుసం పనులు ఎట్ల నడుస్తున్నయ్‌‌‌‌” అంటూ పల్లె జనాలను ఎఫ్‌‌ఎం రేడియో రోజూ పలకరిస్తోంది. లోకల్‌‌ టాలెంట్‌‌ని అందరికీ పరిచయం చేస్తోంది. స్థానిక కళలు, వ్యవసాయ సలహాలు, చదువు, చిన్న పిల్లలకు అక్కరకొచ్చే ముచ్చట్లు, లోకల్ వార్తలు.. అన్నీ చెప్తుంది. పల్లె ముచ్చట్లు, వార్తలు, విశేషాలు చెప్తూ.. ‘‘రేడియో మంజీర” సంగారెడ్డి జనాలకు దగ్గరైంది.

సెల్‌‌ఫోన్‌‌లు, కంప్యూటర్లు 30 ఏళ్ల కింద లేవు. ఊరు మొత్తంలో ఇద్దరు.. ముగ్గురి ఇళ్లలో మాత్రమే టీవీలు ఉండేవి. కానీ..అప్పట్లో కూడా చాలామంది దగ్గర రేడియోలు ఉండేవి.  వార్తలు, మంచి మంచి పాటలు వచ్చేవి. పిల్లల కోసం మంచి కథలు వినిపించేవాళ్లు. ఇప్పుడు పాతకాలం రేడియోలు పోయి ఎఫ్ఎం రేడియోలు వచ్చాయి. అవి కూడా సిటీలోనే వినిపిస్తున్నారు. పల్లె ముచ్చట్లు ఎవరూ చెప్పడం లేదు. అందుకే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో అప్పటి ప్రోగ్రాంలతో ‘90.8 ఎఫ్ఎం రేడియో మంజీరా’ ‘సంగారెడ్డి’కి దగ్గరైంది. పల్లె జనాలతో ముచ్చట్లు పెడుతుంది. సంగారెడ్డి దగ్గరలోని దాదాపు 110 గ్రామాల్లో ఈ రేడియో వినిపిస్తోంది. స్టూడియో, అన్ని రకాల ఎక్విప్‌‌మెంట్స్‌‌, టెక్నాలజీతో పాటు బ్రాడ్‌‌కాస్టింగ్ లైసెన్స్​తో నడుస్తున్న ఈ రేడియో పల్లె జనాల్లో బాగా పాపులర్ అయ్యింది.

రేడియో మంజీర

మంజీర ఎఫ్ఎం ‘సిస్టర్ నివేదిత సొసైటీ’ అనే ఎన్జీవో ద్వారా నడుస్తోంది. ఏడాది కింద చిన్నచిన్న కార్యక్రమాలతో మొదలైంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయి రేడియోగా మార్చారు.  ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రోగ్రామ్స్ లైవ్ బ్రాడ్ కాస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న పిల్లలు కూడా రేడియో జాకీలుగా చేస్తారు. లోకల్‌‌ జనాల్లో దాగి ఉన్న  కళలను గుర్తించి, వాళ్లలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. ఎవరైనా రేడియో జాకీలుగా తమ మాటలను వినిపించవచ్చు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా రేడియో జాకీలుగా మారడానికి ట్రైనింగ్‌‌ కూడా ఇస్తున్నారు. మంచి మంచి ప్రోగ్రామ్స్ వినిపిస్తున్నారు. వ్యవసాయ ముచ్చట్లు, పిల్లలు, పెద్దల్లో చదువుపై శ్రద్ధ పెంచడం, చిన్న పిల్లల సరదా కబుర్లు, లోకల్ న్యూస్, జోకులు, పాటలు, ట్రాఫిక్ రూల్స్, నీటి వాడకం, లోకల్‌‌ ప్రాబ్లమ్స్‌‌, లోకల్‌‌గా ఉన్న రిసోర్స్‌‌ గురించి చెప్పడం, పాజిటివ్ థింకింగ్.. లాంటి సోషల్‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌ ప్రోగ్రామ్స్‌‌ ఎఫ్‌‌ఎంలో వినిపిస్తారు. ఇందులో వచ్చే మంజీర మెలోడీస్‌‌తో పాటు ‘విజ్జక్క ముచ్చట్లు’ భలే ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ‘శుభ సంకల్పం, మనలో మాట, జీవన తరంగాలు, ఇల్లు–హరివిల్లు, ఆరోగ్యం మీ చేతుల్లో, గును ఫంకీ గలియోమే’.. ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్  అన్నీ తెలంగాణ యాసలోనే పల్లెజనాలకు వినిపిస్తున్నరు.

అన్ని ముచ్చట్లు..

రేడియో మంజీరాలో మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ప్రస్తుతానికి రోజుకు 5 గంటల పాటు  అన్ని వర్గాల ప్రజలను మెప్పించగలుగుతున్నాం. లోకల్‌‌గా ఉండే ప్రాబ్లమ్స్‌‌ని, వాటి పరిష్కారాలను లోకల్‌‌ భాషలో చెప్తున్నాం. చిన్న పిల్లల ప్రోగ్రామ్స్‌‌ని చిన్న పిల్లలతోనే నడిపిస్తున్నాం. పిల్లలు వాళ్ల  స్కూల్ సబ్జెక్ట్స్‌‌తో పాటు స్కూల్లో జరిగిన ముచ్చట్లను, జోక్స్‌‌ని లిజనర్స్‌‌తో పంచుకుంటున్నారు. ఆన్‌‌లైన్ క్లాసులు నడుస్తుండడం వల్ల మా ఈ రేడియో క్లాసులు పేద పిల్లలకు ఉపయోగపడుతున్నాయి. రానున్న రోజుల్లో 24 గంటల పాటు ఎఫ్ఎం రేడియో సేవలు అందించే ఆలోచనలో ఉన్నాం. రేడియో జాకీలు కావాలనుకునే వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. – జగదీశ్వర్ యాదవ్, రేడియో మంజీర కో-ఆర్డినేటర్.

 

ఇవి కూడా చదవండి

జస్ట్​ 20 రోజుల్లో 16 వేల కేసులపై తీర్పులు

రామగుండం ఎరువు మరింత ఆలస్యం

క్షణాల్లో కరోనా రిజల్ట్‌‌‌‌‌‌‌‌.. వాసనతో పట్టేస్తున్న ఆర్మీ డాగ్స్

ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయింది

V6 వెలుగు’ కథనాన్ని పిల్ గా తీసుకోండి