హైదరాబాద్, వెలుగు: డెయిరీ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.4,526 కోట్ల ఆదాయం మైలురాయిని అందుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 9 శాతం వృద్ధి.
నాలుగో క్వార్టర్లో కంపెనీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.1,158 కోట్లకు చేరింది. పెరుగు, పనీర్, ఐస్‌క్రీమ్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల (వీఏపీ) నుంచి రూ.396 కోట్ల ఆదాయం వచ్చింది. పాల సేకరణ ధర లీటరుకు 8 శాతం పెరిగి రూ.46.7కు చేరింది.
