నాని గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

నాని గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

విక్రమ్‌ కె కుమార్‌ డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. నాని సరసన నివేధా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా కనిపించనున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆగస్టు-30న రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సోమవారం రిలీజ్ చేసింది యూనిట్.ఇందులో నానితోపాటు నలుగురు మహిళలు, ఓ పాప కనిపించారు.

వారంతా మేడపై నిల్చుని బైనాక్యులర్‌ పట్టుకుని దేన్నో చూస్తున్నారు. ‘బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను..’ అని నాని వారి పాత్రలను ట్విటర్‌ ద్వారా పరిచయం చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్‌ లుక్‌ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.మైత్రీ మూవీ మేకర్స్‌ లో వస్తోన్న మూవీ ఫస్ట్ సాంగ్ ను జులై 18న, టీజర్‌ ను జులై 24న రిలీజ్ చేయనున్నట్లు  తెలిపింది యూనిట్.