అందుకే నా కంపెనీ మూసేశాను.. ఇప్పుడది ప్రపంచంలోనే టాప్

అందుకే నా కంపెనీ మూసేశాను.. ఇప్పుడది ప్రపంచంలోనే టాప్

సినీ ఇండస్ట్రీలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమా.. పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ ను యూజ్ చేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీల డిమాండ్ నడుస్తోంది. ఈ డిమాండ్ ను ముందే గ్రహించిన టాలీవుడ్ హీరో రానా(Rana) తన 18వ ఏటనే స్పిరిట్ పేరుతో ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని స్టార్ చేశారట. అయితే ఆ కంపెనీని కొన్ని అనివార్య కారణాల వల్ల మూసేసానని ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ చెప్పారు రానా.

ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. 2005లో నేను స్పిరిట్ మీడియా పేరుతో విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీను ప్రారంభించాను. దాదాపు ఐదేళ్ల పాటు అందులో పనిచేశాను. ఎప్పటికైనా ఆ స్టూడియో ద్వారా ఒక సినిమా చేయాలనే కోరిక ఉండేది కానీ.. కొంత కాలం తరువాత ఆ కంపెనీ నిర్వహణ భారమైంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా అధునాతనమైనవి. అందుకే నా కంపెనీ ప్రైమ్ ఫోకస్‌ వారికి అమ్మేశాను. ఇప్పుడది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ విజువల్ ఎఫెక్ట్ కంపెనీగా అవతరించింది. నా కంపెనీని అమ్మకానికి పెట్టినప్పుడు నాకేం బాధ అనిపించలేదు. వ్యాపార నిర్వహణ తెలియనప్పుడు.. దాన్నుంచి తప్పుకోవడమే మంచిది.. అని చెప్పుకొచ్చాడు రానా. 

ఇక రానా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న 170వ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.