షూటింగ్ లో హీరో శర్వానంద్ కు గాయాలు

షూటింగ్ లో హీరో శర్వానంద్ కు గాయాలు

టాలీవుడ్ యువ హీరోలకు ఏదో బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. నాలుగు రోజుల క్రితం హీరో వరుణ్ తేజ్ ఓ కారు ప్రమాదం నుంచి బయటపడగా.. మొన్న నాగశౌర్య, నిన్న సందీప్ కిషన్ లు షూటింగ్ సమయంలో ప్రమాదాలకు గురయ్యారు.

తాజాగా మరో హీరో శ‌ర్వానంద్‌కు `96` షూటింగ్‌లో గాయాల‌య్యాయి. `96` షూటింగ్‌లో భాగంగా శ‌ర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో గాయాలపాలయ్యాడు. డైవింగ్ చేసి ల్యాండ్ అవుతున్న సమయంలో  కాళ్ల‌పై ల్యాండ్ కావాల్సిన వ్య‌క్తి భుజాల‌ను మోపి ల్యాండ్ అయ్యాడు. ఆ కార‌ణంగా షోల్డ‌ర్ డిస్ లొకేట్ అయ్యింది. కాలు కూడా స్వ‌ల్పంగా ఫ్రాక్చ‌ర్ అయ్యింది. ఈ ఘ‌ట‌నతో  శ‌ర్వానంద్ వెంట‌నే థాయ్‌లాండ్ నుండి హైద‌రాబాద్ చేరుకొని, సన్ షైన్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యాడు. శ‌ర్వాను ప‌రీక్షించిన డాక్ట‌ర్లు భుజానికి బ‌ల‌మైన గాయం త‌గ‌లింద‌ని, కాబ‌ట్టి శస్త్ర చికిత్స అవ‌స‌రమ‌ని సూచించారు. సోమ‌వారం ఈ శ‌స్ర‌చికిత్స జ‌రగ‌నుంది. స‌ర్జ‌రీ త‌ర్వాత క‌నీసం నాలుగు రోజులు హాస్పిట‌ల్‌లోనే ఉండాల‌ని డాక్ట‌ర్స్ శ‌ర్వాకు సూచించారు.