హీరో విక్రమ్ కు తీవ్ర గాయాలు.. విరిగిన పక్కటెముక

హీరో విక్రమ్ కు తీవ్ర గాయాలు.. విరిగిన పక్కటెముక

 తమిళ స్టార్ హీరో విక్రమ్ కి ప్రమాదం జరిగింది. ఆయన హీరోగా వస్తున్న తంగలాన్ షూటింగ్ సమయంలో ఈ  ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో  విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారట. దీంతో వెంటనే ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ కి  వైద్య పరీక్షలు నిర్వహించిన వైధ్యులు ఆయన పక్కటెముకలు విరిగాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. ఇక ఈ వార్తా తెలుసుకున్న విక్రమ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

విక్రమ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోలార్ గోల్డ్ ఫీల్డ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పాన్ ఇండియా లేవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం తెరకెక్కిస్తున్న ఒక యాక్షన్ ని సీక్వెన్స్ లోనే విక్రమ్ కి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైధ్యులు తెలిపారు.