తెలుగు అబ్బాయితో మృణాల్ థాకూర్ పెళ్లి!..క్లారిటీ ఇచ్చేసింది

తెలుగు అబ్బాయితో మృణాల్ థాకూర్ పెళ్లి!..క్లారిటీ ఇచ్చేసింది

సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఇందులో ఓ వైపు సీతగా, మరోవైపు ప్రిన్సెస్‌‌ నూర్జహాన్‌‌గా తన నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ప్రస్తుతం మృణాల్ తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది.

మృణాల్‌ తెలుగు అబ్బాయిని మ్యారేజ్ చేసుకోబోతుందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె సోషల్‌ మీడియా (Instagram) వేదికగా స్పందించారు..అవన్నీ రూమర్స్‌ అంటూ కొట్టిపారేశారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్‌ చేస్తూ..‘మ్యారేజ్ పై వస్తోన్న వార్తలను చూసి నా ఫ్రెండ్స్,స్టైలిస్ట్‌ డిజైనర్స్‌, బంధువులు వరుసగా ఫోన్‌ చేసి..తెలుగు అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటున్నావా? అని అడుగుతున్నారు. 

ఆ అబ్బాయి ఎవరనేదీ నాకూ తెలుసుకోవాలని ఉంది. ఈ ఫన్నీ రూమర్‌ గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇంకా త్వరలోనే పెళ్లవుతుంది. అయితే.. వరుడిని మీరే వెతికిపెట్టండి.ఆ తర్వాత అతనెవరో నాకు చెప్పండి. కల్యాణ వేదిక, ఆ లోకేషన్‌ వివరాలు కూడా పంపండి. సరేనా?’’ అని సెటైర్ వేశారు. 

ఇక రీసెంట్ గా సైమా 2023 అవార్డుల కార్యక్రమంలో సీతారామం మూవీకి గాను..మృణాల్‌ ఉత్తమ నటి (క్రిటిక్స్‌) విభాగంలో అవార్డు అందుకున్నారు. ఆ అవార్డును ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ (Allu Aravind) చేతుల మీదుగా తీసుకున్న విషయం తెలిసిందే.

అక్కడ అల్లు అరవింద్ మట్లాడుతూ..గతంలో నేనొక ఈవెంట్‌లో హైదరాబాద్‌ అబ్బాయిని పెళ్లి చేసుకుని తెలుగింటికి కోడలిగా రమ్మని ఓ హీరోయిన్‌ (లావణ్య త్రిపాఠి)కి బ్లెస్సింగ్స్‌ ఇచ్చాను. తెలుగు హీరోతో ఆమె ప్రేమలో పడింది. త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఇప్పుడు నిన్ను కూడా బ్లెస్‌ చేస్తున్నా. నువ్వు కూడా ఇక్కడికి తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నా’’ అని నవ్వుతూ అరవింద్ చెప్పారు

ALSO READ :- AFG vs NED: నెదర్లాండ్స్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం.. సెమీస్ రేసు మరింత రసవత్తరం

ప్రస్తుతం మృణాల్..హీరో నాని తో హాయ్ నాన్న మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో నానికి పర్ఫెక్ట్ జోడీగా కనిపిస్తోందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇటీవల హాయ్ నాన్న నుండి రిలీజైన సమయమా అనే సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.హేషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన మెలోడియస్ సాంగ్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. చాలా మంది ఫేవరేట్ లిస్టులోకి చేరిపోయింది ఈ పాట. అలాగే  గీత గోవిందం (Getha Govindam) ఫేం పరశురాం (Parashuram) డైరెక్షన్ లో విజయ్​దేవరకొండ (Vijay devarakonda)తో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది.