హీరోయిన్ శ్రీలీలకు వరుస ఆఫర్స్

హీరోయిన్ శ్రీలీలకు వరుస ఆఫర్స్

హీరోయిన్‌‌గా పరిచయమైన అతి కొద్ది కాలంలోనే వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది శ్రీలీల.  ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్‌‌కు పరిచయమైన ఆమె, మొదటి చిత్రంతోనే అందం, చలాకీతనంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్స్‌‌ క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ వరుసలో మరో మూవీ చేరింది. రామ్‌‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో శ్రీలీలను హీరోయిన్‌‌గా కన్‌‌ఫర్మ్ చేశారు. దసరా సందర్భంగా తన పేరును రివీల్ చేశారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌ గురువారం ప్రారంభమైంది. ఆర్‌‌‌‌ఎఫ్‌‌సిలో స్టంట్ శివ కొరియోగ్రఫీలో భారీ యాక్షన్‌‌ సీన్స్ తీస్తున్నారు.

ముప్ఫై రోజులు ఈ షెడ్యూల్ జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ బాషల్లో రూపొందిస్తున్నారు నిర్మాత శ్రీనివాస చిట్టూరి. తమన్ సంగీతం అందిస్తున్నాడు. బోయపాటి మార్క్ మాస్‌‌ ఎలిమెంట్స్‌‌తో తెరకెక్కుతోన్న ఈ కమర్షియల్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో గ్లామరస్‌‌ రోల్‌‌లో శ్రీలీల కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘ధమాకా’ షూట్​ కంప్లీట్​ చేసిన ఆమె.. బాలకృష్ణ, అనిల్ రావిపూడి చిత్రంలో కీరోల్ చేస్తోంది. నితిన్, వైష్ణవ్‌‌ తేజ్‌‌, నవీన్ పోలిశెట్టి లాంటి యువహీరోల సినిమాల్లోనూ నటిస్తోంది. మరో ఇద్దరు స్టార్స్ సినిమాల్లోనూ తన పేరు వినిపిస్తోంది.