ఇది నయా భారత్.. ఉగ్రవాదులను మట్టుబెట్టే వీడియో

V6 Velugu Posted on Jul 22, 2021

కశ్మీర్: మన దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు టెర్రరిస్టులు పాకిస్థాన్‌ నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా చొరబడుతుంటారు. ఆ ముష్కరులు దాడులకు పాల్పడే లోపు ఎక్కడో ఒక చోట షెల్టర్‌‌ తీసుకుని నక్కి ఉంటారు. ఇలా దాగి ఉన్న టెర్రరిస్టుల గురించి సమాచారం అందడడంతో మన ఆర్మీ రంగంలోకి దిగింది. ఆ ఇంటిపైకి సైనికులు మోయగలిగే మ్యాన్ పోర్టబుల్ మిస్సైల్‌ను ప్రయోగించి, పేల్చేసింది. ఆ తర్వాత పేలుడు ధాటి నుంచి తప్పించుకుని, ఇంకా ఆ మంటల్లో బతికి ఉన్న టెర్రరిస్టులను ఆర్మీ సైనికులు తుపాకులతో కాల్చి మట్టుబెట్టారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్‌‌లో ఒక నెటిజన్ పోస్ట్ చేశాడు. సబ్సిడీతో రూ.10కే పెట్రోల్ ఎవరైనా ఇవ్వగలరు. కానీ ఉగ్రవాదులను మట్టుబెట్టే వీడియో చూపించగలరా? ఇది నయా భారత్ అంటూ ట్వీట్ చేశాడు. బుధవారం అర్ధరాత్రి పోస్ట్ చేసిన ఈ వీడియోను గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయానికే 1600 మంది చూశారు. దీనిని 265 మంది రీట్వీట్ చేయగా, 367 మంది లైక్ కొట్టారు.

ట్వీట్‌ ట్రాన్స్‌లేషన్..

‘‘సబ్సిడీ ద్వారా ఎవరైనా పెట్రోల్‌ను చీప్‌గా పది రూపాయలకే ఇవ్వగలరు. కానీ ఉగ్రవాదులను మట్టుబెట్టే వీడియో లైవ్ మీకు చూపించగలరా? ఇది ఇక్కడ చూడండి. ఇది నయా భారత్. ఇక్కడు ఉగ్రవాదాన్ని అస్సలు సహించేది లేదు. ముష్కరులను అణిచేయడమే ఈ దేశ పాలసీ. ఓ ఇంట్లో దాక్కుని ఉన్న టెర్రరిస్టులను మ్యాన్‌ పోర్టబుల్ మిస్సైల్‌తో మన ఆర్మీ పేల్చేసింది’’ అంటూ శ్రీష్ త్రిపాఠీ అనే నెటిజన్ ఈ వీడియోను ట్వీట్ చేశాడు. ‘‘#IndianArmy, #ModiHaiToMumkinHai,  #TrustNaMo, 
#ModiMatters, #जयहिंद
” ఈ హ్యాష్‌ ట్యాగ్స్‌తో అతడు ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియో ఎక్కడిది? ఎప్పుడు జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌క సంబంధించినది అన్న విషయాలను అతడు వెల్లడించలేదు.

Tagged pm modi, Twitter, pakisthan, Indian Army, kashmir, encounter, terrorist, missile

Latest Videos

Subscribe Now

More News