కర్నాటకలో సీఎం మార్పుపై హైకమాండ్‎దే తుది నిర్ణయం: ఖర్గే

కర్నాటకలో సీఎం మార్పుపై హైకమాండ్‎దే తుది నిర్ణయం: ఖర్గే

బెంగళూరు: కర్నాటకలో సీఎం మార్పుపై హైకమాండ్‎దే తుది నిర్ణయమని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రస్తుతానికి తాను చెప్పడానికి ఏం లేదని పేర్కొన్నారు. శనివారం సీఎం సిద్ధరామయ్యతో గంటకుపైగా సమావేశమైన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం తన నివాసం బయట మీడియాతో మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. “మీటింగ్ గురించి నేను మాట్లాడటానికి ఏమీ లేదు. అందువవల్ల మీరు ఇక్కడ నిల్చొని సమయాన్ని వృథా చేసుకోకండి.  

సీఎంను హైకమాండ్ నిర్ణయిస్తుంది. దాని గురించి నేను చెప్పడానికి ఏం లేదు ’’ అని పేర్కొన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం  ఐదేండ్ల పదవీకాలంలో నవంబర్ 20న సగం రోజులను పూర్తి చేసుకోనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీఎం మార్పుపై ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, సీఎం సిద్ధరామయ్య మాత్రం నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను మీడియా సృష్టేనని అభివర్ణించారు.