సుప్రీం జడ్జిగా జస్టిస్​ ఉజ్జల్​ భూయాన్ నియామకం

సుప్రీం జడ్జిగా జస్టిస్​ ఉజ్జల్​ భూయాన్ నియామకం

సుప్రీం జడ్జిగా జస్టిస్​ ఉజ్జల్​ భూయాన్ నియామకం

జస్టిస్​ ఉజ్జల్‌ భూయాన్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ, వెలుగు : హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్ సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఇటీ వల సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజి యం చేసిన సిఫారసులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదించారు. జస్టిస్ భూయాన్​తో పాటు జస్టిస్‌ ఎస్‌వి భట్టిని కూడా సుప్రీం కోర్టు జడ్జిగా నియమించారు.

జస్టిస్‌ ఎస్‌.వి. భట్టి ప్రస్తుతం కేరళ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌(సీజే)గా ఉన్నారు. వీరిద్ద రిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమి స్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించి నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ ట్విట్టర్​లో వెల్లడించారు.