ఆర్టీసీ కార్మికులను డ్యూటీలో చేర్చుకోవాలన్న విజ్ఞప్తిపై హైకోర్టు
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, గుండెపోటు వంటి వాటిని అడ్డుకునేం దుకు తామేం చేయగలమని హైకోర్టు ప్రశ్నించిం ది. తమ వద్ద మంత్రదండం లేదని, కోర్టులకు కూడా కొన్ని హద్దులు ఉంటాయని పేర్కొంది. సమ్మె వల్లే ఇవన్నీ జరిగాయని పిటిషనర్లు చెప్పడమే వాస్తవమైతే.. అందుకు సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ యూనియన్లనూ నిందించాల్సి ఉంటుందని కామెంట్ చేసింది. డ్యూటీలో చేరుతామని కార్మికులు కోరుతున్నారని, కానీ పిల్‌లో ఆ విషయాన్ని ప్రస్తావించలేదని, సవరించా లని పిటిషనర్, టీజేఎస్ నేత పీఎల్ విశ్వేశ్వర్ రావుకు సూచించింది.
కార్మి కులు కష్టాల్లో ఉన్నారు..
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేలా, కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు తీసుకునేలా సర్కారును ఆదేశించా లంటూ పీఎల్ విశ్వేశ్వర్రావు పది రోజుల కిం ద హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దానిపై చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన డివిజన్ బెం చ్ మంగళవారం విచారణ జరిపింది. జీతాల్లేక, ఒత్తిడికి గురై 30 మంది కార్మికులు గుండెపోటుతో చనిపోవడమో, ఆత్మహత్యలు చేసుకోవడమో జరిగిందని, కార్మికులను డ్యూటీలో చేర్చుకునేలా సర్కారును ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీనిపై స్పందిం చిన బెంచ్ .. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా , గుం డెపోటు రాకుండా ప్రభుత్వం గానీ, హైకోర్టుగానీ ఏం చేయగలదో చెప్పాలని ప్రశ్నించింది. ఆత్మహత్యలపై పత్రికల్లో వచ్చిన వార్తలను పిటిషనర్ కోర్టు పరిశీలనకు ఇచ్చారు. అయితే జీతాల వ్యవహారాన్ని సింగిల్ జడ్జి విచారిస్తున్నారని, ఇతర సమస్యలపై కార్మిక చట్టం కింద పోరాటం చేయొచ్చని బెంచ్ సూచించింది. జీతాలు రాక, పీఎ ఫ్ ను ఆర్టీసీ తీసుకోవడం వల్ల ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే ఆధారాలు చూపాలని బెంచ్ పేర్కొంది. దీంతో ఓ కార్మికుడి సూసైడ్ నోట్ కాపీని పిటిషనర్ కోర్టుకు అందజేశారు.
పిల్ ను సవరించండి
సమ్మె వల్లే ఈ సమస్యలు వచ్చాయని ఎలా చెప్పగలరని పిటిషనర్ ను బెంచ్ ప్రశ్నించింది. సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని సర్కారు చెప్పిందని పిటిషనర్ పేర్కొనగా.. ఏదో అన్నారనడం సరికాదని పేర్కొం ది. సమ్మె తోనే అన్నీ ముడిపడి ఉంటే.. యూనియన్లకూ అవి వర్తిస్తాయని కామెంట్ చేసింది. ఒక స్వతంత్ర కమిటీ వేసి సమస్య పరిష్కరిం చేలా సర్కారును ఆదేశించాలని పిటిషనర్ కోరగా బెంచ్ అభ్యం తరం వ్యక్తం చేసింది. పిల్‌లో కోరని అంశాలపై తాము ఆదేశాలివ్వలేమని, కోర్టులకు కూడా హద్దులు ఉంటాయని, తమ చేతుల్లో మంత్రదండం లేదని పేర్కొంది. పిల్‌ను
సవరిం చి దాఖలు చేయాలని సూచించింది. సవరించి దాఖలు చేస్తానని, బుధవారమే విచారణ చేపట్టాలని పిటిషనర్ కోరగా.. పిల్ ను సవరించాక ఆలోచిద్దామంటూ వాయిదా వేసిం ది.
