
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: లాక్‌డౌన్‌తో కష్టాలు పడుతున్న దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల ఇబ్బందులపై కర్నాటి గణేశ్ వేసిన పిల్‌ను శుక్రవారం విచారించిన కోర్టు ఈ కామెంట్స్ చేసింది. జిల్లా అధికారుల వద్ద రూ.10 వేలు చొప్పున ఉండేలా ప్రభుత్వం రూ. కోటి విడుదల చేసిందని ఏజీ చెప్పగానే కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 40 వేల మంది లాయర్లకు రూ.25 కోట్లిచ్చిన సర్కారుకు దివ్యాంగుల విషయంలో చిన్న చూపు ఎందుకంది. 7 లక్షల మంది ఉంటే సర్కారు ఇచ్చిన రూ. కోటి ఏ మూలకు సరిపోతా యంది. ఏజీ స్పందిస్తూ ఆసరా పెన్షన్ రూ. 3,016.. నిత్యావ సరాలు ఇస్తున్నామన్నారు. విచారణను కోర్టు వాయిదా వేసింది.
రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ
తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి
పడిపోయిన టమాట రేటు