- రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను 4 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. చైర్మన్‌గా తన ఎన్నిక ప్రక్రియ పూర్తయినా అధికారికంగా ప్రకటించకపోవడాన్ని సవాల్‌చేస్తూ టేకుల సుదర్శన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు మంగళవారం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ అయ్యారంటూ ఆయన కుమారుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో చైర్మన్ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
అయితే, అవి అందేసరికే చైర్మన్ ఎన్నిక పూర్తయిందని, అధికారికంగా ప్రకటించకుండా నిలిపివేశారని తెలిపారు. యాదగిరి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి యాదగిరిని బాపట్ల తీసుకెళ్లారన్నారు. యాదగిరి బీఆర్ఎస్చైర్మన్అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి .. ఎన్నికల ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.
