హైదరాబాద్, వెలుగు: ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీంపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను హైకోర్టు కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓయూ ప్రాంగణంలో ఖాసిం ధర్నా నిర్వహించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. క్యాంపస్‌లో ఇలాంటి నిరసనలను నిషేధం ఉందన్నారు. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఖాసీం వేసిన పిటిషన్ ను జస్టిస్ ఎన్.తుకారాంజీ విచారించారు.
పిటిషనర్ న్యాయవాది వాదిస్తూ.. సీఆర్‌పీసీ సెక్షన్ 195 ప్రకారం... ప్రభుత్వ ఉద్యోగి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్ప ఐపీసీలోని 188 సెక్షన్ కింద కేసు నమోదుకు వీలు లేదన్నారు. పోలీసుల చర్య చట్ట వ్యతిరేకమన్నారు. వాదనల తర్వాత.. కేసులను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.
