డీజీపీ నియామకం ప్రభుత్వ పరిశీలనలో ఉంది... హైకోర్టు కు నివేదించిన ఏజీ

డీజీపీ నియామకం ప్రభుత్వ పరిశీలనలో ఉంది... హైకోర్టు కు నివేదించిన ఏజీ

హైదరాబాద్, వెలుగు: డీజీపీ నియామకానికి సంబంధించి యూపీఎస్సీ పంపిన జాబితా ప్రభుత్వ పరిశీలనలో ఉందని హైకోర్టుకు అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ నివేదించారు. దీనిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా డీజీపీగా శివధర్‌‌‌‌ రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో టి.ధనగోపాల్‌‌‌‌రావు పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌ రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుత డీజీపీని తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యారని తెలిపారు. 

ప్రభుత్వం సాకులు చెబుతూ శివధర్‌‌‌‌ రెడ్డిని కొనసాగించాలన్న ఉద్దేశంతో నియామకంలో జాప్యం చేస్తోందన్నారు. నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎ.సుదర్శన్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. యూపీఎస్సీ జాబితాను సిద్ధం చేసి మార్చి 12న రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందని తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. విచారణను ఈ నెల 13కు వాయిదా వేశారు.