కోడెల కూతురిని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు

కోడెల కూతురిని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు

కోడెల శివప్రసాద్ కూతురు విజయలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. నరసరావు పేటలో నమోదైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ  కేసులో విజయలక్ష్మిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.కేసు తదుపరి విచారణను ఆగస్టు 13 కి వాయిదా వేసింది. విజయలక్ష్మి తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని..రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని.. లేకపోతే చంపేస్తామని బెదిరించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.