- కేంద్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారతీయ నావికాదళం ఏర్పాటు చేస్తున్న ఎక్స్‌ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ (ఈఎల్ఎఫ్) రాడార్ ప్రాజెక్ట్‌పై హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం బదలాయించిన 2,900 ఎకరాల అటవీ భూముల అనుమతులు, రెండో దశ అమలు స్థితి, పర్యావరణ నిబంధనల పాటించడం వంటి అంశాలపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ 2020లో దాఖలు చేసిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్)ను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. స్టేటస్ రిపోర్టు సమర్పించేందుకు కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చి.. విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
