పబ్బులు, లిక్కర్ షాపులు నడపడమే ప్రభుత్వానికి ముఖ్యమా

V6 Velugu Posted on Apr 19, 2021

రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ(సోమవారం) హైకోర్టులో విచారణ జరిగింది. జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని అడిగింది.  ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదని అభిప్రాయ పడింది కోర్టు. పబ్బులు, లిక్కర్ షాపులు నడపడమే ముఖ్యమా... అంటూ ప్రశ్నించింది. 

రాష్ట్రంలో జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని కోర్టుకు తెలిపారు ఏజీ. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా?  ఆదేశాలు ఇవ్వమంటారా...? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నంలోగా నివేదించాలని ఆదేశించింది.లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ చేపడతామని చెప్పింది. 
 

Tagged government, high court, questioned, pub-liquor shops important 

Latest Videos

Subscribe Now

More News