కాంగ్రెస్​లోకి హైకోర్టు అడ్వకేట్ దామోదర్రెడ్డి

కాంగ్రెస్​లోకి హైకోర్టు అడ్వకేట్ దామోదర్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు సీనియర్​అడ్వకేట్​ దామోదర్రెడ్డి కాంగ్రెస్​పార్టీలో  చేరారు. శనివారం గాంధీభవన్​లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్​ రావు ఠాక్రే, ఎలక్షన్​ అబ్జర్వర్​ దీపాదాస్​ మున్షీ సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. మాణిక్​ రావు ఠాక్రే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దామోదర్​ రెడ్డి సేవలను కచ్చితంగా ఉపయోగించుకుంటామని, ఆయనకు తగిన ప్రాధాన్యం ఇస్తామని ఠాక్రే హామీ ఇచ్చారు.