పెన్షనర్లకు కోత విధిస్తారా.?ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

పెన్షనర్లకు కోత విధిస్తారా.?ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా పేరుతో పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ లో 50 శాతం కోత విధించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఏ ప్రాతిపదికన కోత విధించారో చెప్పాలని ప్రశ్నించింది. చాలామంది వృద్ధులు పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తారని, వారికి50 శాతం తర్వాత ఇస్తామంటే… ఇంతలో ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఎలాగని అడిగింది. పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ లో 50 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై పలువురు ఫైల్ చేసిన రిట్లపై హైకోర్టు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిం ది. 50 శాతానికి బదులు నాలుగో తరగతి ఎంప్లాయ్స్ లాగే 10 శాతం కోత విధిం చి ఉంటే సరిపోయేదని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అమర్
నాథ్ గౌడ్ లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది.దీనిపై ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశిస్తూ,విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.