
- కేంద్రం ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఐపీఎస్ అధికారి అభిలష బిస్త్ ఏపీ కేడర్లో చేరాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. కేంద్ర ఉత్తర్వులను బిస్త్ సవాలు చేసిన పిటిషన్‌పై క్యాట్ తేల్చే వరకు ఆయన్ను తెలంగాణ క్యాడర్‌లోనే కొనసాగించాలని పేర్కొంది. క్యాట్ తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు ఏపీ కేడర్లో చేరాలని ఆదేశిస్తూ జనవరి 19న కేంద్రం ఇచ్చిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
కేంద్ర ఆదేశాలను నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభిలాష బిస్త్ పిటిషన్ దాఖలు చేయగా.. క్యాట్ అందుకు నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.