యాదగిరిగుట్ట దేవస్థానం..  షాపుల లీజు  ఉత్తర్వులపై హైకోర్టు స్టే

యాదగిరిగుట్ట దేవస్థానం..  షాపుల లీజు  ఉత్తర్వులపై హైకోర్టు స్టే
  •     ఈ నెల 13 వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు ఆదేశం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొండపై ఉన్న 10 తాత్కాలిక మొబైల్ షాపుల లీజు రెన్యూవల్ వివాదంపై రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా లీజును పొడిగిస్తూ ఆలయ ఈవో భవానీ శంకర్ జారీ చేసిన ఉత్తర్వులపై ఈ నెల 13వ వరకు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. ​

కేసు వివరాల్లోకి వెళ్తే.. యాదగిరిగుట్టపై 10 తాత్కాలిక మొబైల్ షాపుల లీజును 'శ్రీలక్ష్మీనరసింహస్వామి వర్తక సంక్షేమ సంఘానికి' అనుకూలంగా షాపులను రెన్యూవల్ చేస్తూ ఆలయ ఈవో భవానీ శంకర్ జులై 9న ఉత్తర్వులు జారీ చేశారు.