రాష్ట్ర స్థాయి ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ పోటీలకు వెల్ది విద్యార్థులు

రాష్ట్ర స్థాయి ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ పోటీలకు వెల్ది విద్యార్థులు

రఘునాథపల్లి, వెలుగు: జిల్లా స్థాయి ఎస్‌‌‌‌‌‌‌‌జీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ పోటీల్లో వెల్ది తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు మంద అజయ్, తురుగొండ శృతి జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు పీఈటీ మారపాక రాజయ్య సోమవారం తెలిపారు.

ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్ విద్యార్థులతో పాటు శిక్షణ ఇచ్చిన పీఈటీలు బైరి వెనిల్‌‌‌‌‌‌‌‌ను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకాంక్షించారు.