
భారత్ పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతుండటంతో ప్రధాని మోదీ మరోసారి హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. త్రివిధ దళాధిపతులతో తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు . ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. మే 10 నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధాని మోదీకి వివరించారు రాజ్ నాథ్.
అంతకుముందు ప్రధాని మోదీతో అజిత్ దోవల్ గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య మోదీ వరుస భేటీలు చర్చనీయాంశంగా మారాయి.
మరో వైపు సరిహద్దులో పాక్ కాల్పులు జరుపుతూనే డ్రోన్లతో దాడిచేస్తోంది. పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ లతో దాడులు చేస్తోంది. అంతే ధీటుగా పాకిస్తాన్ కు బదులిస్తుంది. పంజాబ్ లోని ఎయిర్ బేస్ ధ్వంసానికి పాక్ యత్నించింది. మే 9న రాత్రి 26 ప్రాంతాల్లో దాడులు చేసింది అవంతిపూర్,కుప్వారా,బారాముల్లా ప్రాంతాల్లో పాక్ కాల్పులకు బదులిచ్చింది భారత ఆర్మీ.