కరోనా ఇంకా పోలె..రద్దీ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోండి

కరోనా ఇంకా పోలె..రద్దీ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోండి

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. భారత్ లో కొత్త వేరియంట్లు విస్తరించకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు పెట్టుకోవాలని సూచించింది. చైనా, జపాన్, అమెరికా సహా పలు దేశాల్లో మహమ్మారి పరిస్థితులపై అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాంఢవీయ ఆధ్వర్యంలో హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇకపై కరోనా పరిస్థితులపై చర్చించి చర్యలు తీసుకునేందుకు ప్రతీ వారం సమావేశం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. 

పెరుగుతున్న కేసుల పట్ల ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు జాతీయ టాస్క్ ఫోర్స్ అధిపతి వీకే పాల్.. అవసరమైన పరీక్షలు చేస్తున్నామన్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మార్గదర్శకాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశామన్నారు వీకే పాల్. కొత్తవేరియంట్లను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ నుపరిశీలిస్తున్నామన్నారు. జలుబు ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. 18ఏండ్లలోపు పైబడిన వాళ్లంతా వాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 80శాతం మంది మాత్రమే రెండు డోసులు వేసుకున్నారని..మిగతావారంతా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. సీనియర్ సిటిజన్స్ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు.