మహిళల భద్రత కు అధిక ప్రాధాన్యం

మహిళల భద్రత కు అధిక ప్రాధాన్యం

మాదాపూర్: సైబరాబాద్ పరిధిలో మహిళల భద్రత కు అధిక ప్రాధాన్యతమిస్తున్నామన్నారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. మాదాపూర్ లో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉమెన్ కాంక్లేవ్ 4టీహెచ్ ఎడిషన్ 2022 నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన ‘షీ ఎంపవర్ రిబౌన్స్’ సదస్సులో  స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ ఆఫీసర్ద దివ్య, డీసీపీ అనసూయ పాల్గొన్నారు.ఈ సందర్భంగా  జేఎన్టీయూ నుంచి బయో డైవర్సిటీకి షీ షెటిల్ బస్సులను ప్రారంభించారు. ఈ సంద్బంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ... మహిళలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామన్నారు. కరోనా సమయంలో మహిళా పోలీసుల సేవలు మరువలేనివన్నారు. ఎస్సీఎస్సీ మహిళల అభివృద్ధి కోసం  కృషి  చేస్తున్నామన్నారు. విమెన్, చైల్డ్ స్పెషల్ సెక్రటరీ దివ్య మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం 181 హెల్ప్ లైన్ నెంబర్ పని చేస్తుందని తెలిపారు . మహిళలు ఎలాంటి  ఏదైనా ఆపదలో ఉంటే.. ఈ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి సేవలు పొందాలని సూచించారు.