ఫిబ్రవరిలోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 11 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది 122 ఏండ్ల ఆల్ టైం రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రత పెరగడం వల్ల కరెంటు డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత వేసవితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 20శాతం నుండి 30 శాతానికి పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండలు పెరగంటంతో కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, బోర్ల వాడకం పెరగనుంది. విద్యుత్తు వినియోగం కూడా 229 గిగావాట్ల గరిష్ట స్థాయికి చేరవచ్చు. అయితే అవసరాలకు తగట్లు విద్యుత్తు ఉత్పత్తి జరగడం లేదని, థర్మల్ పవర్ కు అవసరమైన బొగ్గు ఉత్పత్తి జరగడంలేదని నిపుణులు అంటున్నారు. హైడ్రో, సోలార్ పవర్ నుంచి కావాల్సినంత విద్యుత్తు ఉత్పత్తి లభించనందున ఈ ఏడాది విద్యుత్ కోతలు తప్పవని చెబుతున్నారు.
