తాగేటోళ్ల కంటే మద్యం అలవాటు లేనోళ్లకే ఫ్యాటీ లివర్ సమస్య.. మీ వయసు 35 ఏళ్ల లోపు ఉంటే వెంటనే చెక్ చేసుకోండి !

తాగేటోళ్ల కంటే మద్యం అలవాటు లేనోళ్లకే ఫ్యాటీ లివర్ సమస్య.. మీ వయసు 35 ఏళ్ల లోపు ఉంటే వెంటనే చెక్ చేసుకోండి !

మద్యం సేవించే వాళ్లపైన ఈ సొసైటీలో ఉండే అభిప్రాయం ఏంటో చెప్పండి. తాగుబోతులు.. తాగి తాగి ఎప్పుడో పోతారో తెలియదు. లోపల లివర్, కిడ్నీలు పాడై ఉంటాయి..! ఇవే కదా వాళ్ల గురించి తాగనోళ్లు మాట్లాడుకునేవి. కానీ ఇక నుంచి ఆ మటలు బంద్ చెయ్యాలె. ఎందుకంటే తాగుబోతులే కాదు.. తాగనోళ్లు అంతకంటే డేంజర్ లో పడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య.. మందుబాబులకంటే తాగనోళ్లకే ఎక్కువ వస్తుందంట. 35 ఏళ్ల లోపు ఉండే యువకులు మరీ డేంజర్ రిస్క్ లో పడుతున్నట్లు స్టడీస్ చెబుతున్నాయి. అవేంటో.. ఎందుకో తెలుసుకుందాం.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్. 20 నుంచి 30 పై బడిన వాళ్లు అంటే ముఖ్యంగా 35 ఏళ్ల లోపు ఉన్న వాళ్లు.. తాగుడు అలవాటు లేకపోయినా ఈ రోగం బారిన ఎక్కువ పడుతున్నారట. దీనికి కారణం మెటబాలిక్ అంటే జీవక్రియ దెబ్బతినటం ముఖ్యకారణం. 

2000 సంవత్సరం ఆరంభంలో ఈ ఫ్యాటీ లివర్ కేసులు 25 శాతంగ ఉండగా ప్రస్తుతం అవి 38 శాతానికి చేరుకున్నాయి. ఇండియాలో మరీ వేగంగా ఈ సమస్య పెరుగుతోందని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా నగరాల్లో ఉండే యువత ఈ రోగం బారిన పడుతున్నట్లు చెబుతున్నారు. 

కారణం..:

ఫ్యాటీ లివర్ అంటే ఒకప్పుడు తాగుడు కారణంగానే వచ్చేది అనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దీనికి కారణం.. లైఫ్ స్టైల్ లో చోటుచేసుకుంటున్న మార్పులు. మోడ్రన్ వర్క్ కల్చర్. ఇప్పుడున్న పరిస్థితులలో డ్యూటీలో ఎక్కువ సేపు కూర్చోవడం, ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం.. మొదలైన వాటి కారణంగా.. బాడీలో ఉండే శక్తినిన ఖర్చు చేయడంలో ఫిలమవుతున్నాం. 

►ALSO READ | Vastu Tips: పశువుల పాకకు కూడా వాస్తు ఉంటుందా..? పొలం దగ్గర షెడ్డు ఏవైపు ఉండాలి..?

పాండెమిక్.. అంటే కోవిడ్ 19 తర్వాత ఈ ధోరణి మరీ ఎక్కువైంది. కదలకుండా ఉన్న చోటే ఉండటం.. ఫోన్ లేదా స్క్రీన్ చూస్తూ గడపడం, శారీరక శ్రమ లేకపోవడం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా బెడ్ మీద నుంచి కదలకుండా పనిచేసుకుపోవడం.. మొదలైన పోకడలు మనిషిని ఎక్కువ రెస్ట్.. తక్కువ వర్క్.. అనే మోడ్ లోకి తీసుకెళ్లాయట. యువతలో  ఫ్యాటీ లివర్ కేసులు పెరగడానికి ముఖ్యకారణాల్లో ఇదొకటి. 

ఫుడ్ హ్యాబిట్స్:

ఫ్యాటీ లివర్ కు కారణం.. శారీరక శ్రమ లేకపోవడమే కాదు.. ఫుడ్ హ్యాబిట్స్ కూడా. ఎక్కువగా రిఫైండ్ చేసిన ఆహార పదార్థాలు.. ముఖ్యంగా  రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, మితిమీరి చక్కెర వాడకం, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు వీటి కారణంగా మనిషి బ్లడ్ లోఇన్సులిన్ నిరోధక శక్తి తక్కువ ఉండటంతో.. ఫ్యాటీ విలవర్ సమస్య రావడానికి కారణం అవుతున్నాయి.  గతంలో సంప్రదాయకంగా సమృద్ధితో కూడిన బ్యాలెన్స్డ్ ఫుడ్, శారీరక శ్రమ వలన ఇలాంటి సమస్యలు తలెత్తేవి కావు. కానీ ప్రస్తుతం.  అధిక కేలరీలు ఉండే  ఫ్రక్టోజ్ అధికంగా ఉండే డ్రింక్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్:

ఈ రోజుల్లో తక్కువ వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య యువతలో పెద్ద సమస్యగా మారుతోంది.  ఊబకాయం (అధిక బరువు),  నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, టైప్ 2 మధుమేహం, , డిస్లిపిడెమియా వంటివి గతంతో పోల్చితే ఇప్పుడున్న వారికి  పదేళ్లు ముందుగానే వస్తున్నాయి.  ఈ సిండ్రోమ్ కారణంగా.. అధిక బరువు ఉండే వారితో పాటు.. బక్కపలుచన ఉండే వారు కూడా దీని బారిన పడుతున్నారు. 

మెటబాలిక్ సిండ్రోమ్ కు కారణం.. నిద్ర ఎక్కువ లేకపోవడం.. అంటే నిద్రకు అంతరాయం కలగటం..  ఒత్తిడి పెరుగుతుండటం. అర్బన్ లైఫ్ లో ఇవి చాలా కామన్ అయిపోయాయి. ఇవి రెండూ ఆధునిక పట్టణ జీవనానికి ముఖ్య లక్షణాలు. ఒక టైమ్ పద్ధతి లేకుండా షిఫ్టుల వారీ ఉద్యోగాలు, ఒత్తిడి కారణంగా హార్మోన్ల ఇంబ్యాలెన్స్ పెరిగి.. ఇన్సులిన్ ను నిరోధించే సామర్థ్యం కోల్పోతుంది. దీంతో ఈ భ్యాటీ లివర్ సమస్యలు అధికమవుతున్నాయి.  పరోక్షంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా ప్రోత్సహిస్తాయి.

ఫ్యాటీ లివర్ ను గుర్తించేది ఎలా..?

 
ఫ్యాటీ లివర్ అనేది లక్షణాలు లేని వ్యాధి. చాలా మంది యువ రోగులలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. సాధారణ ఆరోగ్య పరీక్షల సమయంలో అనుకోకుండా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.  చిన్న వయసులోనే వచ్చే ఈవ్యాధి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. యువకులలో ఫ్యాటీ లివర్ వేగంగా ఫైబ్రోసిస్‌గా మారవచ్చని అంటున్నారు. దీంతో లాంగ్ రన్ లో సిర్రోసిస్, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని  వివిధ అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. 

మందు తాగం మాకు ఏంటి సమస్య అనుకుంటే కష్టం. యూత్ లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ సమస్యను పరిష్కరించాలంటే, వ్యాధి వచ్చిన తర్వాత గాబరా పడేకంటే.. ముందుచూపుతో కూడిన నివారణ మార్గాలు తప్పనిసరి. అవి:  శారీరక శ్రమను ప్రోత్సహించడం అంటే ఎక్సర్ సైజ్ లు చేయడం, ప్రాసెస్ ఎక్కువగా ఉండేవి, చక్కెర ఉండే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం, తేడా ఉంటే ముందుగానే పరీక్షలు నిర్వహించడం వంటివి చేయాలి.