రాహుల్ గాంధీ ఇంటికి ఢిల్లీ పోలీసులు

 రాహుల్ గాంధీ ఇంటికి ఢిల్లీ పోలీసులు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు వెళ్లారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జనవరి 30న శ్రీనగర్ లో మహిళల సమస్యలపై  రాహుల్ చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని లేపాయి. మహిళలు ఇప్పటికి లైగింక వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు రాహుల్. బాధితుల వివరాలు చెబితే తాము  చర్యలు తీసుకుంటామని మార్చి 16న ఢిల్లీ పోలీసులు నోటిసులిచ్చారు.  లైగింక వేధింపుల బాధితుల సమాచారం ఇవ్వాలని ఇవాళ రాహుల్ నివాసానికి పోలీసులు వచ్చారు. రాహుల్ వివరాలు ఇస్తే తగిన న్యాయం చేస్తామని అన్నారు.  

కేంద్ర హోమంత్రి అమిత్ షా ఆదేశాలు లేకుండా  ఢిల్లీ పోలీసులు  రాహుల్ నివాసానికి వెళ్లడానికి సహసం చేయడం సాధ్యం కాదని రాజస్థాన్  సీఎం  అశోక్ గెహ్లాట్ అన్నారు.. మహిళల వేధింపులకు  సంబంధించిన  కేసు నోటీసు అందిందని, దానిపై రాహుల్ సమాధానం చెబుతారని చెప్పారు. అయిన రాహల్ ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని గెహ్లాట్ ప్రశ్నించారు.