ఆకివీడులో హై టెన్షన్... రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రఘురామ కృష్ణంరాజు దంపతులు

ఆకివీడులో హై టెన్షన్... రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రఘురామ కృష్ణంరాజు దంపతులు

ఏపీలోని ఆకివీడులో రామాలయ నిర్మాణం విషయంలో నెలకొన్న వివాదం గురించి తెలిసిందే.న్యాయపరమైన అడ్డంకులు తప్పడంతో ఆదివారం ( మే 3 ) డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దంపతులు శంకుస్థాపన చేశారు. ఇది ధర్మ విజయం అంటూ హర్షం వ్యక్తం చేశారు రఘురామ కృష్ణంరాజు. ఈ క్రమంలో ఆకివీడులో హైటెన్షన్ నెలకొంది. ఆకివీడు వెళ్లే రహదారులన్నీ దిగ్బంధం చేశారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉంది ఆకివీడు ప్రాంతం. 

మాలపేటలోని గుడిస్థలంలో  రామాలయానికి శంకుస్థాపన చేశారు రఘురామ. ఎవరు అడ్డొచ్చినా రామాలయ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు రఘురామ. ఇదిలా ఉండగా... రఘురామ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు మందకృష్ణ మాదిగ.

గొంతాలమ్మ గుడి కూల్చివేత, ప్రభుత్వ స్థలంలో రామాలయ నిర్మాణం విషయంలో వివాదం తలెత్తింది.ప్రభుత్వ స్థలాల్లో మతపరమైన నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నప్పటికీ... రాజకీయ ప్రయోజనాల కోసం నూతనంగా గుడి నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని... కోర్టును ఆశ్రయించారు దళిత క్రిస్టియన్లు. 

ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు ఇటీవలే పిటిషన్లు కొట్టివేయడంతో రామాలయానికి శంకుస్థాపన చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు.