
అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అదానీ.. సీఎం రేవంత్ బొమ్మలున్న టీషర్ట్స్ వేసుకొని సమావేశాలకు వచ్చారు. రేవంత్.. అదానీ దోస్తులు అంటూ నినాదాలు చేశారు. టీషర్ట్స్ తీసేసి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సెక్యూరిటి సూచిస్తున్నారు. పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.