మాములు డ్రామా కాదు హై-వోల్టేజ్ డ్రామా! 22 ఏళ్ల వ్యక్తి, మైనర్ బాలికతో పోలీసు జీపు ఎక్కి హంగామా అరెస్టు

మాములు డ్రామా కాదు హై-వోల్టేజ్ డ్రామా! 22 ఏళ్ల వ్యక్తి, మైనర్ బాలికతో పోలీసు జీపు ఎక్కి హంగామా అరెస్టు

తాగి డ్రైవింగ్ చేసిన వాళ్ళని చూసుంటారు లేదా తాగి గొడవ చేయడం, ఇతరుల్ని కొట్టడం చూసుంటారు.. కానీ ఓ జంట చేసిన పని ఇప్పుడు సోషమ్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజస్థాన్‌ రాష్ట్రం కోటా సిటీలో ఒక యువ జంట పోలీసు జీపు పైకి ఎక్కి హై-వోల్టేజ్ డ్రామా సృష్టించిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల ఓ వ్యక్తి మద్యం మత్తులో ఇదంతా చేసినట్లు తెలుస్తుంది. 

సమాచారం ప్రకారం సెప్టెంబర్ 19 శుక్రవారం రాంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో హల చల్ చేస్తుంది. అయితే శుక్రవారం రాత్రి పోలీసులను చూసిన ఈ జంట పారిపోతూ కనిపించగా... దింతో అనుమానం వచ్చి పోలీసులు వారిని వెంబడించారు. ఆ తర్వాత ఆ జంటను అనుమానంతో అదుపులోకి తీసుకొని 
 అరెస్టు చేశారు.

అయితే, వారు పోలీసు జీపులో కూర్చోవడానికి బదులుగా పోలీస్ వాహనం పైకప్పుపైకి 10 నిమిషాల పాటు హంగామా చేసారు. ఆ యువకుడితో ఉన్న బాలిక మైనర్ అని సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో 17 ఏళ్ల బాలిక ఆ వ్యక్తిని పోలీసు జీపు పై నుండి కిందకి దింపుతానని పోలీసులకు చెబుతూ కనిపిస్తుంది. 

తనను, 22 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేయవద్దని కూడా ఆమె వేడుకుంది.  విషయం ఏంటంటే ఆ యువకుడు మైనర్ బాలికను తనతో పాటు ఇంటి నుండి పారిపోయేల ప్లాన్ చేశాడు. ఆ జంట పోలీస్ జీపు పై కూడా అనుచితంగా ప్రవర్తించారు. చివరికి పోలీసులు ఆ జంటను కిందకు దించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంపైకి ఎక్కి గందరగోళం సృష్టించినందుకు అతడిపై కేసు నమోదు చేయగా... ఈ విషయంపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. 

మరోవైపు గత వారం భోపాల్‌లోని వీఐపీ రోడ్డులో రాజా భోజ్ విగ్రహం ముందు కొందరు గందరగోళం సృష్టించారు. భోపాల్‌లోని ఫెమస్ ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు  రెచ్చిపోయి విధ్వంసం చేసారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కొందరు యువకులు బైక్‌లపై అక్కడికి వచ్చి రోడ్డు పక్కన ఉన్న చెత్తబుట్టను తన్ని, పగలగొట్టి, తరువాత దానిని పక్కన ఉన్న సరస్సులోకి విసిరారు. ఈ ఘటన ఆ ప్రాంతాన్ని కలవరపెట్టడమే కాకుండా, దారిన వెళ్లేవారికి కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.