హోంశాఖకు రూ.2 లక్షల కోట్లు .. పారామిలటరీ బలగాలకు అత్యధికంగా రూ.1.32 లక్షల కోట్లు

హోంశాఖకు రూ.2 లక్షల కోట్లు .. పారామిలటరీ బలగాలకు అత్యధికంగా రూ.1.32 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: దేశ అంతర్గత భద్రతను పర్యవేక్షించే కేంద్ర హోంశాఖకు 2024–25 మధ్యంతర బడ్జెట్​లో రూ.2,02,868.70 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పారామిలటరీ బలగాలకే ఇందులో అత్యధిక నిధులు దక్కనున్నాయి. హోంశాఖకు కేటాయించిన మొత్తం నిధుల్లో రూ.1,32,345.47 కోట్లు పారామిలటరీ బలగాలకే వెళ్లనున్నాయి. ప్రధాన మంత్రి ఆఫీసు(పీఎంవో), కేబినెట్, కేబినెట్ సెక్రటేరియట్, ఆతిథ్యం, ఎంటర్​టైన్​మెంట్ ఖర్చుల కోసం కేబినెట్‌‌‌‌‌‌‌‌కు రూ.1248.91 కోట్లు ఖర్చు చేయనున్నారు.

అలాగే ఆర్టికల్ 370 రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌కు రూ.37,277.74 కోట్లు ఇస్తారు. లద్దాఖ్‌‌‌‌‌‌‌‌ కోసం రూ.5,958 కోట్లు, అండమాన్ నికోబార్ దీవులకు రూ.5,866.37 కోట్లు, చండీగఢ్ రూ.5,862.62 కోట్లు, పుదుచ్చేరికి రూ.3,269.00 కోట్లు, దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూకు రూ.2,648.97 కోట్లు, ఢిల్లీకి రూ.1,490.10 కోట్లు, లక్షద్వీప్‌‌‌‌‌‌‌‌కు రూ.10 కోట్లు అలాట్​చేశారు.

దేశ అంతర్గత భద్రతను పర్యవేక్షించే సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌)కు రూ.32,809.65 కోట్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌)కు రూ.25,027.52 కోట్లు, ఇండో టిబెటన్​బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కు రూ.8,253.53 కోట్లు, సశస్త్ర సీమా బల్ (ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌బీ)కు రూ. 8,485.77 కోట్లు, అస్సాం రైఫిల్స్‌‌‌‌‌‌‌‌కు రూ. 7,368.33 కోట్లు- ఖర్చు చేయనున్నారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి రూ.3,195.09 కోట్లు, దేశ రాజధాని ఢిల్లీ భద్రతను పర్యవేక్షించే ఢిల్లీ పోలీసులకు రూ.11,177.50 కోట్లు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌‌‌‌‌‌‌‌(ఎస్పీజీ)కు రూ.506.32 కోట్లు కేటాయించారు. వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక ఫండ్ కింద రూ.3,199.62 కోట్లు, సరిహద్దు ప్రాంతా డెవలప్​మెంట్​ప్రొగ్రామ్(బీఏడీపీ)​కి రూ.335.00 కోట్లు, సేఫ్ సిటీ ప్రాజెక్టులకు రూ.214.44 కోట్లు, ల్యాండ్ పోర్ట్ ఆథారిటీకి రూ.330.00 కోట్లు వెచ్చించనున్నారు.

సీబీఐకి  రూ.928 కోట్లు 

కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మల ఈ బడ్జెట్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌(సీబీఐ)కి రూ.928.46 కోట్లు కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.40.4 కోట్లు తక్కువ. 2023–-24 బడ్జెట్ లో సీబీఐకి రూ. 946.51 కోట్లు కేటాయించగా ఆ తర్వాత సవరించిన అంచనాలతో అది రూ.968.86 కోట్లకు పెరిగింది. అయితే ఏజెన్సీకి రూ.928.46 కోట్లు మాత్రమే ఇచ్చారు.

పబ్లిక్ సర్వెంట్లు, ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు అక్రమాలు, అవినీతి.. ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను సీబీఐ దర్యాప్తు చేసే సీబీఐ ఈ నిధులను ట్రైనింగ్​సెంటర్ల డెవలప్​మెంట్, మోడ్రనైజేషన్.. టెక్నికల్, ఫోరెన్సిక్ సపోర్ట్ యూనిట్ల ఏర్పాటు, ఆఫీసులు, సంస్థ ఇతర బిల్డింగ్​ల నిర్మాణం, నిర్వహణ ఖర్చులకు వినియోగిస్తారు.

ఢిల్లీ పోలీసులకు తగ్గిన నిధులు

ఈ మధ్యంతర బడ్జెట్ లో ఢిల్లీ పోలీసులకు కేంద్ర ఆర్థికశాఖ నిధులు తగ్గించింది. 2024–25కు రూ.11,177 కేటాయించింది. అయితే ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4.4 శాతం తక్కువ. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ పోలీసులకు రూ.11,932 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాలతో అది రూ.11,940 కోట్లకు చేరింది. దేశ రాజధానిలో శాంతిభద్రతల బాధ్యత ఢిల్లీ పోలీసులదే.. అలాగే సిటీలో ట్రాఫిక్ నిర్వహణ కూడా వారి పర్యవేక్షణలోనే ఉంటుంది.