కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ కొట్టుకుపోతుంది

కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ కొట్టుకుపోతుంది

రుతు పవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్​ అతలాకుతలం అవుతోంది.గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 10మంది చనిపోయారు. బుధవారం (జూన్​2) రెండుమృతదేహాలను వెలికితీశారు. క్లౌడ్​ బరస్ట్, ఆకస్మిక వరదలు,కొండచరియలు విరిగిపడిహిమాచల్​ ప్రదేశ్​ లోని మండి జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు, మరింత ఆకస్మిక వరదలకు అవకాశంఉందని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్​ అలెర్ట్​ జారీ చేసింది. 

హిమాచల్ లో గత కొద్ది రోజులు ఎడతెరిపిలేకుండా కురస్తున్న వార్షాలకు బియాస్​ నది ఉప్పొంది ప్రవహిస్తోంది. దాని పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. బియాస్​ నది పరివాహక ప్రాంతాల  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ కేంద్రాలు ..

ఎడతెరపి లేకుండా కురస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్​లుని మండి జిల్లాలో తీవ్రంగా నష్టం జరిగింది. మండిలోని తునాగ్​, కర్సోగ్​ లోని కుట్టిబైపాస్​, ఓల్డ్​ బజార, రిక్కీ, గోహార్​ లోని సియాంజ్​, బస్సీ, తల్వారా, ధరంపూర్​ లోని సియాతి, బదరినాధ్​ లో సహా పలు ప్రాంతాల్లో క్లౌడ్​ బరస్ట్​ కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. 
మండి జిల్లాలో పలు ప్రాంతాల్లో 282 రోడ్లలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండి జిల్లాల్లో 182 రోడ్లు పూర్తిగా మూసివేశారు. భారీ వర్షాలు, వరదలతో విద్యుత్ కేంద్రాల్లో ధ్వంసమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా విద్యాత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయి. 

భారీ వర్షాలు, తీవ్రనష్టం,51 మంది మృతి

జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటినుంచి జూలై 1 వరకు క్లౌడ్​ బరస్ట్​ లు, వరదలు,కొండచరియలు విరిగిపడి మొత్తం 51 మంది మృతిచెందారు. 103 మంది గాయపడ్డారు.22 మంది గల్లంతయినట్లు స్థానిక అధికారుల రిపోర్టులు చెబుతున్నాయి.