హిమాచల్‌ కాంగ్రెస్ లో సంక్షోభం.. సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా

హిమాచల్‌ కాంగ్రెస్ లో సంక్షోభం.. సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా

హిమాచల్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను సుఖ్వీందర్ కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారు. ఫిబ్రవరి 27వ తేదీ మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. వారితోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో ఆయన గెలిచారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ పై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో మంత్రి విక్రమాదిత్య  సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను మంత్రి పదవిలో కొనసాగలేనని తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ  మైనార్టీలో పడే  ప్రమాదం ఉండడంతో.. హిమాచల్ లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం పదవి నుంచి సుఖ్వీందర్ ను తొలగించినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.