Virat Kohli: కోహ్లీని ఔట్ చేయడానికి బస్సు డ్రైవర్ సలహా తీసుకున్నా: హిమాన్షు సంగ్వాన్

Virat Kohli: కోహ్లీని ఔట్ చేయడానికి బస్సు డ్రైవర్ సలహా తీసుకున్నా: హిమాన్షు సంగ్వాన్

12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. కేవలం 6 పరుగులే చేసి తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఢిల్లీ తరపున రైల్వేస్ తో జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీని చూసేందుకు రికార్డ్ స్థాయిలో అభిమానులు వచ్చారు. ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తూ కోహ్లీ కనీసం అరగంట కూడా బ్యాటింగ్ చేయలేకపోయాడు. రైల్వేస్ పేసర్ హిమాన్షు సాంగ్వాన్ వేసిన ఒక అద్భుత ఇన్ స్విన్గర్ ని డ్రైవ్ చేయాలని భావించిన కోహ్లీ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో గ్రౌండ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. 

కోహ్లీ ఔట్ తర్వాత హిమాన్షు సాంగ్వాన్ చేసుకున్న సెలెబ్రేషన్స్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. అసలే ఫ్యాన్స్ కోహ్లీ విఫలమయ్యాడనే బాధలో ఉంటే సాంగ్వాన్ ఓవరాక్షన్ విరాట్ అభిమానులకు కోపం తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు అతన్ని విపరీతంగా ట్రోల్స్. దీంతో అతను ఒక్కసారిగా వైరల్ అయిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి బౌల్డ్ చేసిన బంతి తన కెరీర్ లో అత్యంత ముఖ్యమైనదని మ్యాచ్ తర్వాత చెప్పిన సాంగ్వాన్.. విరాట్ ను ఔట్ చేయడానికి బస్ డ్రైవర్ ఇచ్చిన సలహా పని చేసిందని చెప్పాడు. 

Also Read :- అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక మాజీ కెప్టెన్

"మ్యాచ్ కు ముందు, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఢిల్లీ తరపున ఆడుతున్నారని తెలిసింది. ఆ తర్వాత పంత్ ఈ మ్యాచ్ లో ఆడట్లేదని.. కోహ్లీ బరిలోకి దిగుతున్నాడని తెలిసింది. రైల్వేస్ పేస్ అటాక్ కు నేను నాయకత్వం వహిస్తున్నాను. ప్రతి జట్టు సభ్యుడు విరాట్ కోహ్లీని నేను అవుట్ చేస్తానని నాతో చెప్పారు. మేము ప్రయాణిస్తున్న బస్సులో, బస్సు డ్రైవర్ విరాట్ కోహ్లీకి నాల్గవ-ఐదవ స్టంప్ లైన్ వద్ద బౌలింగ్ చేస్తే ఔట్ అవుతాడని నాకు చెప్పాడు. నా స్వంత బలాలపై దృష్టి పెట్టి బౌలింగ్ చేసి కోహ్లీ వికెట్ తీయగలిగాను". అని హిమాన్షు సాంగ్వాన్ తెలిపాడు.