హైదరాబాద్/గండిపేట: వెలుగు: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంటజలాశయాలకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా హిమాయత్ సాగర్ రిజర్వాయరు గత రెండు రోజులుగా ఇన్ఫ్రా భారీగా పెరగడంతో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వాటర్ బోర్డు రిజర్వాయర్ ఒక గేటును అడుగు మేరకు ఎత్తి 1,000 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న మూసీ నదిలోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ముందే జంటజలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరిందని తెలిపారు.
