హిందీ ఛత్రపతి ట్రైలర్ వచ్చేసింది.. బెల్లం బాబు ఇరగొట్టేశాడు

హిందీ ఛత్రపతి ట్రైలర్ వచ్చేసింది.. బెల్లం బాబు ఇరగొట్టేశాడు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తోన్న మూవీ ఛత్రపతి. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్-, రాజమౌళి కాంబోలో వచ్చిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతికి ఇది హిందీ రీమేక్. మే 12, 2023న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ ను  రిలీజ్ చేశారు మేకర్స్.

మాస్ ఆడియన్స్ కి మాత్రం ఈ ట్రైలర్ ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ట్రైలర్ మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ తో నింపేశారు. చూస్తుంటే.. ఒరిజినల్ లో కంటే రీమేక్ లో యాక్షన్ పాళ్ళు కాస్త ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కథలో కూడా పెద్దగా మార్పులు చేసినట్టు కనిపించడంలేదు. కొన్ని షాట్స్ అయితే సేమ్ టూ సేమ్ దించేశారు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఛత్రపతి క్యారెక్టర్ లో బాగానే సెట్ అయ్యడాని చెప్పాలి. ఈ మూవీ  రీమేక్ మొదలైనప్పటినుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి పాత్రలో ఎలా ఉంటాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. కానీ.. బాగానే సెట్ అయ్యాడు. బాడీని కూడా బాగా పెంచేశాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ట్రైలర్ క్లియర్ గా కనపడుతోంది.

ఒరిజినల్ ఛత్రపతిలో ఎమోషనల్ సీన్స్ పీక్స్ లో ఉంటాయి. సినిమా విజయంలో కూడా కీ రోల్ పోషించాయి. ఈ సినిమాలో కూడా ఆ సీన్సే కీలకం కానున్నాయి. ఆ ఎమోషన్ కనుక వర్క్ అవుట్ అయితే.. ఈ సినిమా కూడా విజయం సాధించడం పక్కా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా బాలీవుడ్ లో ఎలాంటి రిజల్ట్ ని దక్కించుకుంటుందో తెలియాలంటే మే 12 వరకు ఆగాల్సిందే.