హిందుస్థాన్ జింక్ ప్రొడక్షన్ డబుల్.. రాబోయే ఐదేళ్లలో  రూ.50 వేల కోట్ల పెట్టుబడి

హిందుస్థాన్ జింక్ ప్రొడక్షన్ డబుల్.. రాబోయే ఐదేళ్లలో  రూ.50 వేల కోట్ల పెట్టుబడి

హైదరాబాద్​, వెలుగు: హిందుస్థాన్ జింక్ తన 60 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉత్పత్తిని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఐదేళ్లలో రూ.40వేల నుంచి రూ.50వేల కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు మిలియన్ టన్నులకు పెంచనుంది.

కంపెనీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ ప్రియా అగర్వాల్  మాట్లాడుతూ భవిష్యత్తు ఇంధన అవసరాలకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. జింక్​తో పాటు టంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టన్, పొటాష్ వంటి అరుదైన ఖనిజాల కోసం అన్వేషణ సాగిస్తోంది.  ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ ద్వారా జింక్ ఆధారిత తయారీని చేపట్టనుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2028 నాటికి 70 శాతం విద్యుత్తును పునరుత్పాదక వనరుల ద్వారా పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.  నాలుగు వేల గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కంపెనీ తెలిపింది.