ఉప్పల్ భగాయత్ భూముల వేలం.. గజం రూ.35 వేలు

ఉప్పల్ భగాయత్ భూముల వేలం.. గజం రూ.35 వేలు

ఉప్పల్ భగాయత్ భూముల ఈ వేలం మొదలైంది. ఇవ్వాళ, రేపు 44 ప్లాట్లను అధికారులు వేలం వేయనున్నారు. నాలుగు దశలుగా కొనసాగనున్న ఈ బిడ్డింగ్ ఆన్ లైన్ విధానంలో జరగనుంది. ఈ ప్లాట్ల ధర హెచ్ఎండీఏ గజానికి రూ. 35 వేలుగా ఫిక్స్ చేసింది. మొత్తం లక్షా 35 వేల గజాలు అమ్మకానికి పెట్టింది సర్కార్. ప్రతి గజానికి బిడ్డింగ్ లో వెయ్యి రూపాయల చొప్పున పెంచే చాన్స్ ఉంది. చిన్న ప్లాట్లు ఉండటంతో సాధారణ ప్రజలు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ వేలం ద్వారా వెయ్యి కోట్లను సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది.