- రూ. 3.67 కోట్లతో నిర్మాణానికి హెచ్ఎండీఏ సన్నాహాలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: నగరంలోని ట్యాంక్‌బండ్‌ను ఆనుకుని ఉన్న సంజీవయ్యపార్కులో అతిపెద్ద స్విమ్మింగ్‌పూల్ నిర్మించడానికి
హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఇది నగరానికి మరో ఐకానిక్ ప్లేస్‌లా నిలిచిపోయేలా ప్లాన్చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరిగేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. సిటీలోని ముఖ్యమైన పార్కుల్లో లుంబినీ, ఎన్టీఆర్, ఇందిరా పార్కుల తర్వాత సంజీవయ్య పార్కు కూడా ఉంటుంది. ఈ పార్కుకు రోజుకు ఐదు వేలకు పైగా సందర్శకులతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లోవాకింగ్ కు వెయ్యి నుంచి 12 వందల మంది వరకు వాకర్స్వస్తుంటారు.
వీరితో పాటు నగరంలో స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా ప్రయోజనకరంగా ఉండేలా నిర్మించబోతున్నారు. రూ. 3.67 కోట్ల ఖర్చుతో త్వరలో పనులు ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేసేలా బుద్దపూర్ణిమ ప్రాజెక్ట్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఆసక్తి గల సంస్థలను ఆహ్వానించనున్నారు.

