V6 News

ఏపీ లిక్కర్ స్కామ్‌‌‌‌ కేసులో ఈడీ సోదాలు...ఏపీ, హైదరా బాద్‌‌‌‌ లోని 12 ప్రాంతాల్లో తనిఖీలు

ఏపీ లిక్కర్ స్కామ్‌‌‌‌ కేసులో ఈడీ సోదాలు...ఏపీ, హైదరా బాద్‌‌‌‌ లోని 12 ప్రాంతాల్లో తనిఖీలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఏపీ లిక్కర్ స్కామ్‌‌‌‌ కేసులో నిందితులు సహా పలు కంపెనీల కార్పొరేట్‌‌‌‌ కార్యాలయాల్లో ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్‌‌‌‌లోని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంటితోపాటు బంజారాహిల్స్, ఆదర్శ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, అత్తాపూర్‌‌‌‌‌‌‌‌, విజయవాడ, తిరుపతిలోని 12 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. 

నిందితుడు  రాజ్ కేసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, ఆడిటర్‌‌‌‌‌‌‌‌ బాలాజీ గోవిందప్ప, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో సోదాలు చేశారు. లిక్కర్‌‌‌‌ పాలసీలో పెట్టుబడులు, మనీలాండరింగ్‌‌‌‌, హవాలా రూపంలో రూ. వేల కోట్లు చేతులు మారినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం.